అన్ని ఉద్యోగాలు TSPSC ద్వారానే! - JNTU UPDATES
Headlines News :
Home » » అన్ని ఉద్యోగాలు TSPSC ద్వారానే!

అన్ని ఉద్యోగాలు TSPSC ద్వారానే!

Written By Unknown on Saturday, 20 December 2014 | 00:28

అన్ని ఉద్యోగాలు TSPSC ద్వారానే!

2010021960930501_225273eఉద్యోగ నియామకాల్లో మార్పులపై కసరత్తు చేస్తోంది సర్కార్ . అన్ని ఉద్యోగాలను TSPSC ద్వారానే చేట్టాలని భావిస్తోంది. కేరళ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
అన్ని ఉద్యోగాలు….కానిస్టేబుల్  నుంచి  గ్రూప్ 1 వరకు అన్ని ఉద్యోగాల భర్తీని TSPSCకే అప్పగించాలని భావిస్తోంది  ప్రభుత్వం. ఉపాధ్యాయ పోస్టుల నియామకం  కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అప్పజెప్పాలన్న ఆలోచనలో ఉంది. కేరళలోని సిస్టమ్ ను ఇక్కడ అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై తర్వలో నిర్ణయం తీసుకోనుంది.
ఒక్కో శాఖ…ఒక్కో ఉద్యోగం…ఉమ్మడి రాష్ట్రంలో  ఉపాధ్యాయ ఖాళీలను  డీఎస్సీ ద్వారా  ఫిలప్ చేస్తున్నారు.కానిస్టేబుల్ , ఎస్సై పోస్టులను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు … . వీఆర్ ఏ, వీఆర్ వో ఉద్యోగాలను రెవెన్యూ డిపార్ట్ మెంట్ , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ , అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులను అటవీ శాఖ …ఇలా ఒక్కో రకమైన ఉద్యోగాలను ఒక్కో శాఖ భర్తీ చేస్తోంది. దీంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పెద్దగా పనిలేకుండాపోయింది.
కొన్నింటికే పరిమితం…గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4, లెక్చరర్, ఇంజ నీర్ వంటి కొన్ని రకాల పోస్టుల భర్తీకే  పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిమితమయింది.  అయితే  ప్రభుత్వ శాఖలే సొంతంగా ఉద్యోగాల  నియామకం చేపట్టడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది. టీఎస్ పీఎస్సీ  ద్వారా అన్ని  ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆలోచిస్తోంది.  ఇప్పటివరకు ఉన్న శాఖలను పూర్తిగా రద్దు చేయాలా? సర్వీస్ కమిషన్ పరిధిలోకి తీసుకురావాలా  అన్న అంశంపై  త్వరలో  నిర్ణయం తీసుకోనుంది. టీఎస్ పీఎస్ సీ మొదటి భేటీలో ఇదే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. స్పాట్ …
డీఎస్సీ…?ఉపాధ్యాయ నియామకాలను గతంలో పబ్లిక్ సర్వీసు కమిషనే చేపట్టింది. తర్వాత ఈ బాధ్యతను విద్యాశాఖకు అప్పగించారు. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, డీఈవో కన్వీనర్ గా డీఎస్సీలను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ వ్యవహారం విద్యాశాఖకు తలనొప్పిగా మారింది. తక్కువ సిబ్బందితో ఎక్కువ పని చేయాల్సి వస్తోంది. ఇక రోస్టర్ విధానంపై డీఈవోలకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో అనేక సమస్యలు వస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయ పోస్టుల  భర్తీ TSPSC కి అప్పగించాలన్న నిర్ణయానికొచ్చింది ప్రభుత్వం.
అక్రమాలకు చెక్ ….రాష్ట్రంలో ప్రస్తుతం లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ బాధ్యతను  టీఎస్ పీఎస్సీ కి అప్పగించడం వల్ల అక్రమాలకు చెక్ పెట్టొచ్చని ప్లాన్ చేస్తోంది సర్కార్.
Share this article :

0 comments:

Speak up your mind

Tell us what you're thinking... !

 
Support : Creating Website | Johny Template | Mas Template
Proudly powered by Blogger
Copyright © 2011. JNTU UPDATES - All Rights Reserved
Template Design by Creating Website Published by Mas Template